13-2-1992 వ సం. దేవాలయ నిర్మాణమునకు శంకుస్థాపన.
శ్రీ షిర్డి సాయి బాబా సంస్థాన్ గా ఏర్పాటు. అదే సం. విజయదశిమి రోజున ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహం తో పూజలు. 1994 వ సం. లో శ్రీ షిర్డి సేవ సంస్థాన్ ట్రస్ట్ గా రిజిస్టర్ చేసి 33 మంది ట్రస్ట్ సభ్యులు గా ఏర్పాటు.
ఛైర్మన్ గా శ్రీ కొండ కృష్ణ మూర్తి , అధ్యక్షులు గా కీ.శె. శీవ్వ శంకరయ్య , ఉపాధ్యక్షులు శ్రీ గందే శ్రీనివాస్ , కార్యదర్శి గా శ్రీ తడక మండ్ల నర్సయ్య ,సహాయ కార్యదర్శి శ్రీ వెంగళదాస్ రాజమౌళి, కోశాధికారి శ్రీ నల్ల శివానందం మరియు 27 మంది ట్రస్ట్ కార్యవర్గంగా రిజిస్టర్ చేయడం జరిగింది.
1997 వ సం. జనవరి లో శ్రీ అమ్ముల సాంబశివరావ్ గారి కరకమలములచే శ్రీ షిర్డి సాయి స్థూపం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ కొబ్బరి కాయలు కొట్టడం జరుగుతుంది. దీనిచుట్టు 41 రోజులు 11ప్రదక్షిణములు[ప్రతిరోజు] చేసినచో భక్తుల కోరికలు శ్రీ షిర్డి సాయి నాధుడు తీర్చుతుంటారు.
12 ఫిబ్రవరి1997 వ సం. వసంతపంచమి శ్రీ శ్రీ శ్రీ పుష్పగిరి శంకరాచార్య పీఠాధిపతి శ్రీ మది బినావోధండ విద్య నృసింహ భారతి వారి కరకమలముల తో కన్నుల పండుగగా శ్రీ శ్రీ షిర్డి సాయి నాధుని పాల రాతి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అదే రోజు విఘ్నేశ్వరుడు,దత్తాత్రేయుడు మరియు శివపార్వతుల విగ్రహప్రతిష్ఠ , శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ సహిత విగ్రహాల ఆవిష్కరణ జరగడం గొప్ప శుభపరిణామం.
దేవాలయంలో నిరంతరంగా వెలిగే ధుని అగ్ని ప్రతిష్ఠ జరిగింది. దేవాలయంలో చుట్టూ శ్రీ షిర్డి సాయి చరిత్ర లీలలు రంగురంగుల చిత్ర పఠాలు గోడలపై ఆవిష్కరించడం జరిగింది. 01 ఆగస్ట్ 2007 రోజున కీసర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ సత్యపధానంద ప్రభుజీ వారి ఆద్వర్యములో ధ్యానమందిరంలో ధ్యాన, యోగ తరగతులు ఆరంభించడం జరిగినది.
30 ఆగస్ట్ 2007 రోజున అన్నదాన భవన నిర్మాణమునకు భూమి పూజా శంకుస్థాపన జరిగింది. అనతికాలంలో భక్తుల సహాయ సహకారాలతో మొదటి స్లాబ్ వేయడం జరిగింది . అదే రోజున ముస్తాబాద్ చౌరస్త వద్ద కమాన్ నిర్మాణ పూజ జరిగింది .
- దేవాలయం లో రక్త దాన శిభిరాలు నిర్వహించడం జరిగినది .
- దేవాలయంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగినది .
- దేవాలయం లో ఉచిత హోమియో వైద్య శిభిరం ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో జరిగినది .
- దేవాలయం లో ప్రతి గురువారం వైద్యుల పర్యవేక్షణలో ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది .
ఇలా పలు స్వచ్ఛంద శిభిరాలు నిర్వహించడం జరుగుతుంది . ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది . ఈ అన్నదాన కార్యక్రమం లో 600 మంది స్వామి ప్రసాదం స్వీకరించడం జరుగుతుంది .
శ్రీ షిర్డి సాయి నాథుని ఆర్చి కమాన్ నిర్మాణం జరుగుతుంది. శ్రీ షిర్డి సాయి నాథుని రథం చేయించడం జరుగుతుంది .
13 ఏప్రిల్ 2008 రోజున పతంజలి శ్రీ రామ్‌దేవ్ వారి శిష్యుల ఆద్వర్యములో యోగ నిర్వహించడం జరిగినది . 31 జనవరి 2009 పుష్కరవార్షికోత్సవం రోజున స్వామి వారికి భక్తులు చేయించిన ఊయల ఆవిష్కరించడం జరిగింది. అదే రోజు వెబ్ సైట్ మరియు సాయి రథం ప్రారంభం జరిగింది .